(Local) Sun, 23 Feb, 2020

ఐక్యరాజ్య సమితికి నిధుల కొరత

October 09, 2019,   12:21 PM IST
Share on:
ఐక్యరాజ్య సమితికి నిధుల కొరత

ఐక్యరాజ్య సమితిలో నిధుల లేమితో సతమతమవుతోంది. ఈ సందర్భంగా ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్ మాట్లాడుతూ.. 
ప్రస్తుతం యూనో 230 మిలియన్ల డాలర్ల లోటుతో ఉన్నట్లు తెలిపారు. అరకొరగా ఉన్న నిధులు కూడా అక్టోబరు నెలాఖరుకు ఖాళీ అయ్యే అవకాశముందని తెలిపారాయన. యూనో సచివాలయంలో పనిచేసే 37వేల మంది ఉద్యోగులను ఉద్దేశించి ఆయన లేఖ రాశారు. ఇందులో ఈ అంశాలను ప్రస్తావించారు సెక్రటరీ జనరల్. వీటిపై తక్షణ చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారాయన. నగదు కొరత ఏర్పడుతుందని ముందే గ్రహించిన గుటెరస్ ఈ ఏడాది ఆరంభంలోనే సభ్య దేశాలను హెచ్చరించారు. ఆయా దేశాలు చెల్లించాల్సిన మొత్తాన్ని వీలైనంత త్వరగా జమచేయాలని సూచించారు. 2018-19 సంవత్సరానికి యూనో 5.4 బిలియన్‌ డాలర్ల బడ్జెట్‌ను నడిపింది. ఇందులో 22 శాతం నిధులు అమెరికా ద్వారా వచ్చినవే.
 

సంబంధిత వర్గం
ప్రపంచదేశాలు ఉగ్రవాదం పై పోరాడాలి  - వెంకయ్య నాయుడ ...
ప్రపంచదేశాలు ఉగ్రవాదం పై పోరాడాలి - వెంకయ్య నాయుడ ...
పెట్టుబడులకు భారత్ స్వర్గధామం
పెట్టుబడులకు భారత్ స్వర్గధామం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.