(Local) Thu, 28 May, 2020

మోడీ పుట్టినరోజుకి విలువైన మొక్కు చెల్లించిన అభిమాని

September 17, 2019,   3:10 PM IST
Share on:
మోడీ పుట్టినరోజుకి విలువైన మొక్కు  చెల్లించిన అభిమ ...

ప్రధాని మోదీ 69వ పుట్టిన రోజున ఓ అభిమాని ఏకంగా 1.25 కిలోల బంగారు కిరీటాన్ని సమర్పించడం సంచలనం అయ్యింది. సంకత్ మోచన్ ఆలయంలోని హనుమంతుడికి ఈ కిరీటాన్ని సమర్పించి మొక్కు చెల్లించుకున్నాడు. వారణాసి నియోజకవర్గానికి చెందిన అర్వింద్ సింగ్ అనే వ్యక్తి ప్రధాని మోదీకి వీరాభిమాని. ఆయన రెండోసారి అధికారం చేపట్టాలని ఎన్నికల ముందుకు మొక్కుకున్నాడు. అనుకున్నట్టుగానే అఖండ మెజార్టీతో బీజేపీ ప్రభుత్వం మోదీ నేతృత్వంలో కొలువదీరింది. తన మొక్కును ప్రధాని పుట్టిన రోజు సందర్భంగా తీర్చుకోవాలని భావించి ఓ కిరీటాన్ని తయారు చేయించాడు. ఒకరోజు ముందే దేవుడికి మొక్కు చెల్లించి ప్రత్యేక పూజలు చేయించాడు. ఈ సందర్భంగా ఆయన పాలన తీరును అర్వింద్ సింగ్ కొనియాడారు. దేశానికి మంచి రోజులు వచ్చాయంటూ వ్యాఖ్యానించారు. 

సంబంధిత వర్గం
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.