(Local) Tue, 20 Aug, 2019

ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలు మరోసారి విఫలం -చంద్రబాబు

May 20, 2019,   11:43 AM IST
Share on:

ఏపి సిఎం చంద్రబాబు ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలు మరోసారి విఫలమయ్యాయని ట్విట్‌ చేశారు. అయితే ఏపిలో టిడిపి ప్రభుత్వం వస్తుందనడంలో సందేహం లేదు. కేంద్రంలో బిజెపియేతర పార్టీలు పూర్తిస్థాయి మెజారిటీ సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయనే నమ్మకంతో ఉన్నాం. 50% పోలింగ్‌ కేంద్రాల వీవీప్యాట్‌ స్లిప్పులు లెక్కించాలని మరోసారి కేంద్ర ఎన్నికల సంఘాన్ని డిమాండ్‌ చేస్తున్నాం. ఓట్ల లెక్కింపునకు ముందే శాసనసభకు 5 వీవీప్యాట్ల స్లిప్పుల లెక్కింపు చేపట్టాలిగ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే క్షేత్రస్థాయి వాస్తవాలను గుర్తించడంలో ఎగ్జిట్‌పోల్స్‌ తప్పిన ఘటనలు గతంలో అనేకం ఉన్నాయని ఆయన అన్నారు.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.