(Local) Tue, 21 May, 2019

లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన అత్యంత ధనికులు వీరే

May 15, 2019,   11:43 AM IST
Share on:

ఏడు విడతలుగా సాగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా అన్ని పార్టీలతో కలిపి 8049 మంది అభ్యర్దులు బరిలో ఉన్నారు. ఐతే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులలో అత్యంత సంపన్నులు ఎవరు అన్నదానిపై అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రీఫార్మ్స్‌ సర్వే నిర్వహించింది. ఎంపి అభ్యర్దులుగా బరిలో ఉన్న వారి అఫిడవిట్లు ఆధారంగా చేసుకుని నిర్వహించిన సర్వేలో దేశంలోని లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన అత్యంత ధనికుడైన అభ్యర్ధి బీహార్‌కు చెందిన ఇండిపెండెంట్‌ అభ్యర్ధిగా గుర్తించారు.బీహార్‌కు చెందిన ఆర్కే శర్మ రూ.1107 కోట్లు తన అఫిడవిట్లో పేర్కొని అత్యంత ధనిక అభ్యర్ధిగా తేలారు. ఇక రెండు, మూడు స్థానాలు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు కావటం విశేషం. రెండో స్థానంలో చేవెళ్ల కాంగ్రెస్‌ అభ్యర్ధి కొండా విశ్వేశ్వరరెడ్డి నిలిచారు. రూ. 895 కోట్లు తన అఫిడవిల్లో పేర్కొన్నారు. మూడో స్థానంలో కొండాపై పోటీ చేసిన టిఆర్‌ఎస్‌ అభ్యర్ధి రంజిత్‌ రెడ్డి నిలవటం ఆసక్తికర అంశంగా మారింది.

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.