(Local) Thu, 18 Jul, 2019

పాకిస్థాన్ లో ఘోర రైలు ప్రమాదం

July 11, 2019,   4:54 PM IST
Share on:

పాకిస్థాన్ దేశంలో గురువారం రెండు రైళ్లు ఢీకొన్న ప్రమాద ఘటనలో 10 మంది ప్రయాణికులు మృతి చెందారు. గురువారం ఉదయం సాధిఖాబాద్ నగర సమపీంలో వల్హర్ గ్రామం వద్ద వేగంగా వస్తున్న అక్బర్ ఎక్స్‌ప్రెస్ గూడ్సురైలును ఢీకొంది. ఈ ఘటనలో పదిమంది రైలు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. మరో 35 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంలో ఒకదానిపై ఒకటి చిక్కుకుపోయిన రైలు బోగీలను హైడ్రాలిక్ కట్టర్ల సాయంతో తొలగిస్తున్నామని డీపీఓ రహీం యార్ ఖాన్ చెప్పారు. ఈ రైలు ప్రమాద ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు పాక్ రైల్వేశాఖ మంత్రి షేక్ రషీద్ అహ్మద్ సంతాపం తెలిపారు. ఈ రైలు ప్రమాద ఘటనపై దర్యాప్తు చేస్తామని పాక్ రైల్వేశాఖ మంత్రి చెప్పారు.

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.