(Local) Tue, 17 Sep, 2019

వాట్సాప్ లో ఇక అవి కుదరవు...

August 20, 2019,   12:02 PM IST
Views: 129
Share on:
వాట్సాప్ లో ఇక అవి కుదరవు...

వాట్సాప్.. మెసేజ్‌ల ఖర్చులు లేకుండా చేసి కొద్ది రోజుల్లోనే కోట్లాది మంది భారత వినియోగదారులను ఆకట్టుకున్న మెసేజింగ్ యాప్ ఇది. మెసేజ్ డెలివరీ అయ్యిందా? లేదా? అయితే ఎప్పుడు అయ్యింది? ఆ మెసేజ్‌ను చూశారా? రిప్లై ఇస్తున్నారా? ఆన్‌లైన్‌లో ఉన్నారా? తదితర ఫీచర్లతో వినియోగదారులను ఆకర్షించింది. ఆ తర్వాత కూడా వినియోగదారులకు సౌలభ్యంగా ఉండేలా మరెన్నో ఫీచర్లను, ఎమోజీలను ప్రవేశపెట్టింది. రోజులు మారుతున్న కొద్దీ కొత్త కొత్త ఫీచర్లతో, హంగులతో వరల్డ్ నంబర్ వన్ మెసేజింగ్ యాప్‌గా కొనసాగుతోంది. అయితే ఇప్పుడు మరో నాలుగు కొత్త ఫీచర్లతో వినియోగదారులకు మరింత దగ్గర అయ్యేందుకు ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా ‘గ్రూప్’ సమస్యను అధిగమించేందుకు ఓ ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తోంది. మన ప్రమేయం లేకుండా ఎవరో క్రియేట్ చేసిన గ్రూప్‌లో  చేరిపోవడం .... మనం లెఫ్ట్ అవుతుండటం.. జరుగుతోంది.

దీన్నుంచి స్వాంతన చేకూర్చేందుకు కొత్తగా ప్రైవసీ సెట్టింగ్‌ మార్చుకోవచ్చు. మనం అనుమతి ఇస్తేనే గ్రూప్‌లో చేరేలా కొత్త ఫీచర్ అందుబాటులోకి రాబోతోంది. ఆహ్వానం వచ్చిన 72 గంటల్లో దాన్ని ఓకే చేయాలి. లేకపోతే గ్రూప్‌లో చేరే అవకాశం ఉండదు. అలాగే నంబరును వాట్సాప్ గ్రూపుల్లో చేర్చవద్దు అనే యాప్షన్ కూడా ఉంది. వేలిముద్ర సహాయంతో వాట్సాప్‌ను అన్‌లాక్ చేసుకునే సదుపాయాన్ని వాట్సాప్ కల్పించింది. స్పామ్ మెసేజ్‌లను గుర్తించేందుకు ఫ్రీక్వెంట్లీ ఫార్వర్డెడ్ ఫీచర్‌ను కూడా ప్రారంభించింది. ఒకేసారి అనేక వాయిస్ మెసేజ్‌లను వరుసగా వినే అవకాశాన్ని కూడా వాట్సాప్ అందుబాటులోకి తెస్తోంది.

సంబంధిత వర్గం
వాట్సాప్‌ న్యూ అప్డేట్.....!
వాట్సాప్‌ న్యూ అప్డేట్.....!
వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్
వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.