(Local) Mon, 21 Oct, 2019

ప్రపంచ ఓజోన్ పరిరక్షణ దినోత్సవం

September 16, 2019,   2:18 PM IST
Share on:
ప్రపంచ ఓజోన్ పరిరక్షణ దినోత్సవం

ఓజోన్ అన్ని జీవరాసులకు శక్తిని అందించే తరగని శక్తివనరు సూర్యుడు. సూర్యుడు భూమిపై శక్తికి మూలాధారం. సూర్యుడి నుంచి వచ్చే ఈ కాంతి కిరణాలలో కొన్ని హానికరమైన కిరణాలు కూడా ఉంటాయి. వీటిని అతినీలలోహిత కిరణాలు అంటారు. ఇవి చాలా ప్రమాధకారమైనవి. ఇవి మన శరీరంపై పడితే చర్మ క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తాయి.
ఈ నీలలోహిత కిరణాలు భూమిని చేరకుండా అడ్డుకునేది ఓజోన్ (o3)పొర. ఇది భూమికి 10 నుండి 50 కిలోమీటర్ల ఎత్తులో వ్యాపించి హానికర కిరణాలు భూమిని చేరకుండా కాపాడుతుంది.కానీ మానవుడు ఉపయోగించే రిఫ్రిజిలేటర్లు, జెట్ విమానాల నుండి వచ్చే క్లోరోఫ్లోరో కార్బన్ అనే వాయువు, మిటైల్ బ్రోమైడ్ అనే కీటక నాశిని ఓజోన్ పొరకు రంధ్రం ఏర్పరుస్తున్నాయి. ఈ రంధ్రం నుండి హానికారక కిరణాలు భూమిని చేరతాయి.ఈ ప్రమాదాన్నీ గుర్తించిన ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం ఓజోన్ పొరను పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని అవగాహన కల్పించుటకు 1995 వ సంవత్సరం నుండి సెప్టెంబర్ 16 ను ఓజోన్ పరిరక్షణ దినంగా నిర్వహిస్తోంది.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.